ముంబై ఇండియన్స్ పై గుజరాత్ టైటాన్స్ 36 పరుగుల తేడాతో విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది.
197 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ 35 పరుగులకే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది. రికెల్టన్ 6 పరుగులు, రోహిత్ శర్మ 8 పరుగులు చేసి అవుట్ అయ్యారు
ఆ తరవాత వచ్చిన తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ లు మూడవ వికెట్ కు 62 పరుగులు జోడించారు. అయితే తిలక్ వర్మ 39 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 48 పరుగులు చేసి వెంట వెంటనే అవుట్ అవడంతో ముంబై ఇండియన్స్ తేరుకోలేకపోయింది. కెప్టెన్ హార్దిక్ పాండ్య 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు
చివరకు ముంబై ఇండియన్స్ 20 ఓవర్ల లో 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి విజయానికి 36 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
సీజన్ ని ఓటములతో మొదలు పెట్టడం ముంబై ఇండియన్స్ కు అలవాటే. ముంబై కు ఓపెనింగ్ కష్టాలు ఉన్నాయి. రోహిత్ శర్మ ఆడడం మొదలు పెడితే ముంబై ఇండియన్స్ గెలుపు బాట పడుతుంది
గుజరాత్ టైటాన్స్ బౌలర్ల లో సిరాజ్, ప్రసిద్ కృష్ణ లు రెండేసి వికెట్లు తీయగా, రబడా, సాయి కిశోర్ లు చెరో ఒక వికెట్ తీశారు
అంతకు ముందు టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సీజన్ లో టాస్ గెలిచిన వెంటనే ప్రతి జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంటోంది
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు 20 ఓవర్ల లో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది
గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్ మన్ గిల్ లు మొదటి వికెట్ కు 78 పరుగులు జోడించారు. 27 బంతుల్లో 38 పరుగులు చేసి శుభ్ మన్ గిల్ అవుట్ అయ్యాక క్రీజ్ లోకి వచ్చిన బట్లర్ తో కలిసి సాయి సుదర్శన్ రెండవ వికెట్ కు 51 పరుగులు జోడించారు. 24 బంతుల్లో 39 పరుగులు చేసిన బట్లర్, ఆ తరవాత వచ్చిన షారుఖ్ ఖాన్ వెంట వెంటనే అవుట్ అయ్యారు
సాయి సుదర్శన్, రూథర్ ఫోర్డ్ కాసేపు వికెట్లు పడకుండా ప్రతిఘటించినా, బౌల్ట్ యార్కర్ కు, 41 బంతుల్లో 63 పరుగులు చేసిన ఓపెనర్ సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు. ఆ తరవాత వచ్చిన రాహుల్ తెవాతియా లేని పరుగుకు పరిగెత్తి రన్ అవుట్ అయ్యాడు. అదే ఓవర్ లో 18 పరుగులు చేసిన రూథర్ ఫోర్డ్ కూడా అవుట్ అయ్యాడు. 179 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్లను కోల్పోయింది
తెలుగు కుర్రాడు సత్యనారాయణ వేసిన ఆఖరి ఓవర్లో రషీద్ ఖాన్, సాయి కిశోర్ లు అవుట్ అయ్యారు
ముంబై ఇండియన్స్ బౌలర్ల లో పాండ్య రెండు వికెట్లు తీయగా, ముజిబుర్ రెహ్మాన్, బౌల్ట్, దీపక్ చాహర్, సత్యనారాయణలు తలా ఒక వికెట్ తీశారు

