కోనో కార్పస్ చెట్లకు నీళ్లు అవసరం లేదు. ఆక్సిజన్ తీసుకుంటి కార్బన్ డయాక్సైడ్ ను వదులుతుంది. పక్షులు కూడా వాటిమీద వాలడానికి ఇష్టపడవు. ఈ మొక్కలు ఎక్కడ పడితే అక్కడ పెరుగుతాయి. తెలంగాణ లో చాలా చోట్ల ఈ చెట్లు ఉన్నాయి. ఇటీవల, GHMC ఈ కోన కార్పస్ చెట్లపై నిషేధం విధించింది.
కోన్ ఆకారంలో ఈ చెట్లు పెరుగుతాయి. అందంగా ఉంటాయన్న ఒకే ఒక్క కారణం తప్ప ఈ కోనోకార్పస్ చెట్ల వలన ఎలాంటి ప్రయోజనాలు లేవు. పక్షులు కూడా ఈ పూలను, పండ్లను తినవు. పక్షులు ఈ చెట్ల మీద గూడు పెట్టుకోవడానికి కూడా పనికి రావు. ఒకప్పుడు వాతావరణంలో వేడిని తగ్గిస్తుందని ఈ కోనోకార్పస్ చెట్లను పెంచారు. అయితే తరవాత రోజులలో వాతావరణ కాలుష్యానికి ఈ చెట్లు కారణమవుతున్నాయని, ఈ చెట్ల వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వృక్ష, పర్యావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు ఈ చెట్ల వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులు, అలెర్జీలు వస్తున్నాయి.
మొదట ఈ కోనోకార్పస్ మొక్కలను కువైట్, ఖతర్, యూఏఈ., పాకిస్థాన్, ఇరాక్ లలో బాగా పెంచారు. ఆ తరవాత కాలంలో ఈ మొక్కలు పర్యావరణ, ఆరోగ్య సమస్యలు తలెత్తుతుండడం తో పాటు, ఈ మొక్కలకు ఉన్న బలమైన వేరు వ్యవస్థతో, భూగర్భ జలాలను ఎక్కువగా వాడుతుందని అని పర్యావరణ, వృక్ష శాస్త్రవేత్తలు చెప్పడంతో ఆయా దేశాలు ఈ మొక్కల పెంపకంపై నిషేధాన్ని విధించాయి అంతే కాకుండా కొన్ని చెట్ల గాలి పీల్చడం ద్వారా శ్వాస సంబంధమైన వ్యాధులు, అలెర్జీలు వస్తాయి అనే విషయంలో గతంలో రుజువైంది. ముఖ్యంగా పసుపు పచ్చ పూలు పూసే మొక్కలకు సాధ్యమైనంతవరకు దూరంగా ఉండాలి. కొన్ని రకాలైన మొక్కల, చెట్ల గాలిద్వారా చర్మ సంబంధిత వ్యాధులు కూడా రావచ్చు

