టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చిన మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘మ్యాడ్ స్క్వేర్’. సూపర్ హిట్ సినిమా మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కింది. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కల్యాణ్‌శంకర్ దర్శకుడు. హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించారు. భారీ అంచనాల మధ్య మార్చి 28న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే బాక్సాఫీస్ వద్ద మొదటిరోజే భారీ కలెక్షన్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. మ్యాడ్ స్క్వేర్ (Mad Square) చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 650కి పైగా థియేటర్లలో విడుదల చేశారు. అయితే, ఈ సినిమా మొదటిరోజే బాక్సాఫీస్ వద్ద రూ. 20.8 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సెన్సేషనల్ రికార్డ్ సాధించింది. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు క్రేజీ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
అయితే ఈ వారం బాక్సఫీస్ వద్ద ఎంపురాన్, వీర ధీర శూర, రాబిన్ హుడ్ (Robinhood) వంటి పెద్ద చిత్రాలు విడుదలయ్యాయి. బాక్సఫీస్ వద్ద గట్టి పోటీని తట్టుకుంటూ కూడా మ్యాడ్ స్క్వేర్ అన్ని సినిమాల కంటే సాలిడ్ ఓపెనింగ్స్ సాధించింది. కాగా, రెండేళ్ల కిందట విడుదలైన మ్యాడ్ సినిమా మొత్తంగా రూ. 26 కోట్లు కలెక్షన్స్ సాధించింది. ఇక మొదటిరోజే మ్యాడ్ స్క్వేర్ రూ. 20.8 కోట్లు రాబట్టడం విశేషం. ఇక ఇక్కడే కాకుండా ఈ సినిమాకు ఓవర్సీస్లోనూ భారీ స్థాయిలో థియేటర్లు నిండుతున్నాయి. ఈ క్రమంలోనే మ్యాడ్ స్క్వేర్ ( Mad Square ) తొలిరోజే ఓవర్సీస్లో అదిరిపోయే కలెక్షన్లు సాధించింది. విడుదలైన తొలిరోజే 650 డాలర్లకు పైగా కలెక్షన్స్ వసూల్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం వీకెండ్ రావడంతో పాటుగా ఉగాది, రంజాన్ హాలిడేస్ వరుసగా రావడంతో తొలి వారంలోనే ఈ మూవీ ఊహించని కలెక్షన్స్ సాధించే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

