చిరు’త’ నుండి గ్లోబల్ స్టార్ వరకు ఎదిగిన రామ్ చరణ్

by | Mar 27, 2025 | ప్రగడ టీవీ

చిరుత నుండి గ్లోబల్ స్టార్ వరకు ఎదిగిన రామ్ చరణ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు 

మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ అని మెగాభిమానులందరూ పిలుచుకునే కధానాయకుడు, నటుడు రామ్ చరణ్.

తండ్రి మెగాస్టార్ చిరంజీవి అయితే కొడుకు గ్లోబల్ స్టార్ కాకపోతే ఇంకేమవుతాడు అని ఆ మధ్య ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, రామ్ చరణ్ బాబాయ్ ఆయిన శ్రీ పవన్ కల్యాణ్ గారు అన్న మాటల్లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు

1985 మార్చ్ 27 న చెన్నైలో పుట్టిన రామ్ చరణ్ 2007 లో చిరు తనయుడిగా చిరుత తో చిత్ర రంగ ప్రవేశం చేశారు. మొదటి సినిమాతోనే డాన్స్ లు, ఫైట్ లతో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు

మొదటి చిత్రం తో బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ హిట్ కొట్టిన రామ్ చరణ్ రెండవ చిత్రం తోనే తెలుగు సినిమా రూపు రేఖలను మారుస్తాడు అని ఎవరు ఊహించలేదు.  రాజమౌళి దర్శకత్వంలో 2009 లో వచ్చిన మగధీర అప్పటికి తెలుగు సినిమా చరిత్రలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రామ్ చరణ్ ని రాజమౌళి నమ్మినంతగా ఎవరు నమ్మలేదు.  ముఖ్యంగా అల్లు అరవింద్ నమ్మలేదు ఈ సినిమాని మిగతా భాషలలో విడుదల చేద్దామని రాజమౌళి అనగా, అల్లు అరవింద్ అందుకు అంగీకరించలేదని మనం సోషల్ మీడియాలో చదివాం

రెండవ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఏకైక హీరో రామ్ చరణ్.  మగధీర లో రామ్ చరణ్ హార్స్ రైడింగ్, 100 మందితో చేసే ఫైట్, బంగారు కోడిపెట్ట పాట ఈ రోజు కు తెలుగు సినీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి

ఆ తరవాత 2010 లో వచ్చిన కల్ట్ సినిమా ఆరెంజ్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఒక డిఫెరెంట్ సినిమా.  ఈ సినిమాలో పాటలన్ని సూపర్ హిట్. సినిమా కూడా బావుంటుంది. ఈ కధ 5-6 సంవత్సరాల ముందే రావడంతో ప్రేక్షకులకు ఎక్కలేదు.  దీనితో, ఈ సినిమా ప్లాప్ అయింది. అయితే రి రిలీజ్ లో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరధం పట్టారు. ఒక ప్లాప్ సినిమాని రి రిలీజ్ చేసినా  ప్రేక్షకులు చూశారంటే ఆ కధ ఈ తరం ప్రేక్షకులకు ఎంత నచ్చిందో అర్ధం చేసుకోవచ్చు

ఈ సినిమా ప్లాప్ అయిన తరవాత వరసగా 3 కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు  రామ్ చరణ్. 2012 లో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ, 2013 లో వి వి వినాయక్ దర్శకత్వంలో నాయక్, 2014 లో వంశి పైడిపల్లి దర్శకత్వంలో ఎవడు చిత్రాలు సూపర్ హిట్ అయ్యి మాస్ ఆడియన్స్ లో రామ్ చరణ్ క్రేజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్లాయి.

అయితే రామ్ చరణ్ సినీ జీవింతంలో అనుకోకుండా వచ్చిన ప్లాప్ 2013 లో నేరుగా హిందీ లో నటించిన జంజీర్ చిత్రం.  ఇటీవల బాల కృష్ణ తో చేసిన ఒక షో లో, రామ్ చరణ్ మాట్లాడుతూ,  జంజీర్ సినిమా ఎందుకు చేశానో నాకే తెలీదు అని అన్నారు

అయితే 2014 లో కృష్ణ వంశి దర్శకత్వంలో వచ్చిన గోవిందుడు అందరివాడేలే చిత్రం, 2015 లో వచ్చిన బ్రూస్ లీ చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు  

2016 లో వచ్చిన ధ్రువ చిత్రం రామ్ చరణ్ ని ఒక స్టైలిష్ యాక్టర్ గా ఇండస్ట్రీ లో నిలిపింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది

2018 లో సుకుమార్ దర్శకత్వంలో రంగ స్థలం రామ్ చరణ్ లోని నటుడిని మరో మెట్టు ఎక్కించింది.  చెవిటి వాడి పాత్రలో రామ్ చరణ్ చేసిన నటన సర్వత్రా ప్రశంసలు అందుకున్నాయి. అంతే కాదు సుకుమార్ కు రంగ స్థలం తో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు

2019 లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ చిత్రం దారుణ పరాజయాన్ని చవి చూసింది. అయితే స్టార్ మా లో ప్రసారం చేసినపుడు ఇప్పటికి మంచి రేటింగ్ లు వస్తున్నాయి.

2022 లో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.  ముఖ్యంగా రామ్ చరణ్ చేసిన అల్లూరి సీతారామ రాజు పాత్రని బాలీవుడ్ ప్రేక్షకులు రాముడు అనుకుని నీరాజనాలు పట్టారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ తో చేసిన నాటు, నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది.  ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి తెలుగు సినిమా ఆర్ ఆర్ ఆర్

2022 మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమా లో అతిధి పాత్రలో కనిపించాడు. సినిమా పరాజయం పాలైన రామ్ చరణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి

2025 లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చెంజర్ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే నత్తి ఉన్న వ్యక్తి గా రామ్ చరణ్ నటనకు ప్రశంసలు వచ్చాయి. అనే కారణాల వలన గేమ్ చేంజర్ థియేటర్ లో ఆశించినంత ఆడలేదు

నటుడిగానే కాకుండా,  2016 లో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ స్థాపించి నిర్మాతగా సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. తండ్రి మెగాస్టార్ చిరంజీవి తో ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి లాంటి చిత్రాలను నిర్మించి అభిరుచి గల నిర్మాతగా నిరూపించుకున్నాడు.  అంతే కాకుండా నిర్మాతగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థతో గాడ్ ఫాదర్ చిత్రాన్ని నిర్మించారు.  అంతే కాకుండా నిఖిల్ తో ఇండియా హౌస్ అనే చిత్రాన్నియు  వి క్రియేషన్స్ తో కలిసి నిర్మిస్తున్నారు

2012 లో అపోలో హాస్పిటల్స్ కు చెందిన ఉపాసన కామినేని ని వివాహం చేసుకున్నారు.  రామ్ చరణ్ కు ఇటీవలే ఒక పాప పుట్టింది. పేరు క్లింకార

2024 లో రామ్ చరణ్ కు వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది

 ప్రస్తుతం రామ్ చరణ్  బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా, దాని తరవాత సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.

రామ్ చరణ్ 18 ఏళ్ళ కెరీర్ లో చేసింది కేవలం 14 తెలుగు సినిమాలు అందులో ఒకటి అతిధి పాత్ర.  ఒక హిందీ సినిమా చేశాడు. నిర్మాతగా నాలుగు సినిమాలు చేశారు

అయితే చేసిన 18 సినిమాలలో మూడు ఇండస్ట్రీ హిట్లు. మగధీర, రంగ స్థలం, ఆర్ ఆర్ ఆర్.  ఈ మూడు సినిమాలు ఎలాంటి వివాదాలు లేని క్లీన్ ఇండస్ట్రీ హిట్ లు.  3 ఇండస్ట్రీ హిట్ లు కొట్టినా సెల్ఫ్ డబ్బా కొట్టుకోకుండా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం రామ్ చరణ్ సొంతం. 

రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్సీ 16 లో రామ్ చరణ్ లుక్ ను టైటిల్ ను ఈ ఉదయం విడుదల చేశారు. ఈ చిత్రానికి పెద్ది అనే టైటిల్ ను ఖరారు చేశారు

రామ్ చరణ్ గారి సినీ కెరీర్ లో  మరపురాని సన్నివేశాల గురించి తెలుసుకుందాం

మగధీర సినిమాలో రామ్ చరణ్ హార్స్ రైడింగ్, బంగారు కోడిపెట్ట పాత, 100 మంది సైన్యంతో చేసిన ఫైట్

  • రంగస్థలం లో చిట్టిబాబు క్యారెక్టర్
  • ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్, రెండవ భాగంలో చేసిన అల్లూరి సీతారామ రాజు, నాటు నాటు పాటకు ఎన్టీఆర్ తో చేసిన డాన్స్
  • గేమ్ చెంజర్ లో అప్పన్న క్యారెక్టర్
  • ధ్రువ సినిమా లోని ధ్రువ క్యారెక్టర్

మొదటి రెండు చిత్రాలకు (చిరుత, మగధీర) నంది అవార్డు లు అందుకున్నహీరో రామ్ చరణ్..  అంతే కాకుండా 5 సార్లు ఫిలిం ఫేర్ అందుకున్న హీరో రామ్ చరణ్

కమర్షియల్ విజయాలే కాదు తన అసమాన నటనతో ఐకానిక్  క్యారెక్టర్ లను, సీన్ల ను ప్రేక్షకుల మదిలో నిలిపిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు ప్రగడ టీవీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది