నిఖిల్‌ ‘స్వయంభు’లో రామసేతు రహస్యం

by | Mar 27, 2025 | సినిమా

టాలీవుడ్ యువ కథానాయకుడు నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్, న‌భా న‌టేష్ క‌థ‌నాయిక‌లుగా నటిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతికతో నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీకరణ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే నిఖిల్ ఫ‌స్ట్ లుక్‌తో పాటు సంయుక్తా మేనన్, న‌భా న‌టేష్ లుక్‌లను రిలీజ్ చేయగా ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా కథ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం ‘స్వయంభూ’ సినిమా కథలో రామసేతు పాత్ర చాలా కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆడమ్ బ్రిడ్జ్‌గా, సేతుబంధనంగా పేర్కొనే రామసేతు నిర్మాణాలపై లోతుగా పరిశోధనలు జరిపారు శాస్త్రవేత్తలు. అందులో షాకింగ్ అంశాలు బయటపడిన సంగతి తెలిసిందే.

నాసా శాటిలైట్ పంపిన చిత్రాల ఆధారంగా రామసేతుపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు ఆ వంతెన సహజసిద్దంగా ఏర్పడింది కాదని తేల్చారు. అంటే ఎవ్వరో ఆ రాళ్లను తీసుకొచ్చి ఆ బ్రిడ్జిలా పేర్చుకుంటూ పోయారన్నది శాస్త్రవేత్తల మాట. ఇదే నిజమైతే ఆ రాళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి. ఎవరు వాటిని తీసుకొచ్చారు. అనేది ‘స్వయంభు’ సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా.. కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో మే లేదా జూన్ నెలల్లో గ్రాండ్‌గా ఈ సినిమా విడుద‌ల కానుంది.