RC16: మెగా బర్త్ డే సర్‌ప్రైజ్.. ‘పెద్ది’గా రామ్ చరణ్

by | Mar 27, 2025 | సినిమా

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘ఆర్‌సీ16’ వర్కింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. కాగా, కుస్తీతో పాటు క్రికెట్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. తాజాగా చిత్ర బృందం మెగా అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్‌ అందించింది. ఈ రోజు (మార్చి 27) హీరో రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ‘ఆర్సీ 16’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి ‘పెద్ది’ (Peddi) అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో రామ్ చరణ్ పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, నోట్లో సిగరెట్ తో ఉన్న యూనిక్ లుక్ చూసిన మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఈ సినిమాలో రామ్‌చరణ్‌ (Ram Charan) ఆట కూలీగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో కథ రీత్యా రామ్‌చరణ్‌ అన్ని ఆటల్లో ఆరితేరి ఉంటాడట. అందుకే క్రికెట్‌, కుస్తీ, కబడ్డీ ఇలా ఆట ఏదైనా డబ్బులిస్తే ఆయా జట్ల తరపున బరిలోకి దిగుతాడాని తెలుస్తోంది. అయితే ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని పార్లమెంట్‌ భవనం ఆవరణలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందట. ఇక్కడ రామ్‌చరణ్‌తో పాటు ఇతర ముఖ్య నటులపై సీన్స్ షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అధికారుల అనుమ‌తులు కూడా అందినట్లు సమాచారం. అలాగే కథలో భాగంగా ఢిల్లీలోని జామా మసీదు ఆవరణలోనూ ముఖ్య సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం మేకర్స్ అనుమతులు కూడా తీసుకున్నార‌ని స‌మాచారం.

కాగా, ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ అనుకున్నారు. కానీ చిత్రీకరణ ఇంకా చాలా వరకు పూర్తవకపోవడంతో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. క‌న్న‌డ నటుడు శివరాజ్‌కుమార్, దివ్యేండు శ‌ర్మ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఎఆర్ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

https://twitter.com/vriddhicinemas/status/1905103470077907207