పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఐదవ వన్ డే లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్ల లో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది.
39 బంతుల్లో 51 పరుగులు చేసిన కెప్టెన్ సల్మాన్ ఆఘా పాకిస్థాన్ ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్. షాదాబ్ ఖాన్ 28 పరుగులు, మొహమ్మద్ హారిస్ 11 పరుగులు చేశారు. ఈ ముగ్గురు మినహా మిగతా ఎవరు రెండంకెల స్కోర్ చేయలేదు. హాసన్ నవాజ్ డక్ అవుట్ అయ్యాడు
న్యూజిలాండ్ బౌలర్ల లో జేమ్స్ నీషమ్ 4ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. డఫీ రెండు వికెట్లు తీయగా, బెన్ సీర్స్, ఐష్ సోది లు చెరో ఒక వికెట్ తీశారు
అనంతరం 129 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ కేవలం 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది.
ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్ లు మొదటి వికెట్ కు 93 పరుగులు జోడించారు. 12 బంతుల్లో 27 పరుగులు చేసిన ఫిన్ అలెన్ అవుట్ అయిన తర్వాత వచ్చిన మార్క్ చాప్ మన్ రెండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు
అయితే టిమ్ సీఫెర్ట్ మాత్రం మరో వైపు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి ఆడాడు. టిమ్ సీఫెర్ట్ 38 బంతుల్లో 10 సిక్సర్లు, 6 ఫోర్ల సాయంతో 97 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు
న్యూజిలాండ్ చేసిన 131 పరుగులలో టిమ్ సీఫెర్ట్ చేసిన పరుగులు 97 అంటే సీఫెర్ట్ ఎంతగా రెచ్చిపోయాడో అర్ధం చేసుకోవచ్చు. 5 వికెట్లు తీసిన జేమ్స్ నీషమ్ ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు

