ఐపీల్ : ఉప్పల్ లో థమన్ సంగీత విభావరి

by | Mar 26, 2025 | వార్తలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఆతిధ్యం ఇస్తున్న వేదికల్లో 18 వ సీజన్ ను సెలెబ్రేట్ చేస్తున్నారు

ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ ఈ నెల 27 న ఉప్పల్ క్రికెట్ స్టేడియం లో సంగీత విభావరి నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎక్స్ వేదికగా ప్రకటించింది

మార్చ్ 27 న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో సాయంత్రం 6.30 లకు థమన్ సంగీత విభావరి ప్రారంభమవుతుంది.  మార్చ్ 27 న సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.

మార్చ్ 27 న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు కావడం విశేషం