అఖిల్ మాస్టర్ ప్లాన్.. ఒకేసారి రెండు సినిమాలు షురూ

by | Mar 25, 2025 | సినిమా

టాలీవుడ్ లో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో ఒకరు అక్కినేని అఖిల్‌‌. గతంలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో నటించిన ఏజెంట్ మూవీ బాక్సాఫీస్ వద్ద వద్ద నిరాశ పరిచింది. ఇప్పటివరకు నటించిన ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో.. అఖిల్‌ తదుపరి సినిమా ఏంటి అని ఎదురుచూస్తున్న వారి కోసం ఇటీవలే కొత్త అప్‌డేట్ తెరపైకి వచ్చింది. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్‌ కిరణ్‌ మురళీకిశోర్‌ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఈ మూవీకి ‘లెనిన్‌’ (Lenin Akhil) అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సైలెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇది చిత్తూరు రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని వార్తలు వినిపిస్తున్నాయి.

భారీ బడ్జెట్ తో అన్నపూర్ణ స్డూడియోస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా బరిలో నిలపాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే అఖిల్‌ (Akkineni Akhil) తాజాగా మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌న్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ‘సామజవరగమన’ మూవీకి రైటర్ గా పనిచేసిన నందు చెప్పిన స్క్రిప్ట్ అఖిల్​ కు నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్టును అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఫుల్ లెంగ్త్ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. ఈ ఏడాది సెకండాఫ్ లో షూటింగ్ మొద‌లు పెట్టి చిత్రీక‌ర‌ణ పూర్తి చేయ‌నున్నారు. ఈ సినిమాకు శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు తెలియాల్సి ఉంది.