విక్రమ్ ‘వీర ధీర సూరన్‌’ పవర్ ప్యాక్‌డ్‌ ట్రైలర్ విడుదల

by | Mar 22, 2025 | సినిమా

తమిళ అగ్ర కథానాయకుడు  చియాన్ విక్రమ్ నటిస్తోన్న తాజా చిత్రం ‘వీరధీరసూరన్‌’.  ఎస్‌యూ అరుణ్‌ కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగం. దుషారా విజయన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్‌జే సూర్య, సూరజ్‌ వెంజరమూడు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది. అయితే ముందుగా పార్ట్ 2 ని విడుదల చేస్తున్నారు.  దీనికి ప్రీక్వెల్ గా పార్ట్ 1 ని రూపొందిస్తున్నారు

భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో శ్రీలక్ష్మి మూవీస్‌, తెలంగాణలో ఎన్‌వీఆర్‌ బ్యానర్లు విడుదల చేయనున్నారు.

మార్చి 27న వీరధీరసూరన్‌ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుండగా.. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.

ఇదిలాఉంటే.. మరోవైపు విక్రమ్‌ స్టార్ డైరెక్టర్ గౌత‌మ్ వాసు దేవ్ మీనన్ దర్శకత్వంలో ధ్రువ నక్షత్రం సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.