2025 సమ్మర్ సినీ వినోదాలు

by | Mar 19, 2025 | ప్రగడ టీవీ

ఈ సమ్మర్ లో మొదటి భారీ హిట్ కొట్టాడు నాచురల్ స్టార్ నాని. నాని నిర్మించిన ‘కోర్ట్’ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది

ఈ నెలాఖరులో మార్చ్ 28 న మైత్రి మూవీ మేకర్స్ వారి రాబిన్ హుడ్ (Robinhood) , సితార వారి మాడ్ స్క్వేర్ చిత్రాలు వస్తున్నాయి.  100% వినోదం గ్యారంటీ అంటున్నారు మేకర్స్

ఏప్రిల్ 10 న  బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జొన్నలగడ్డ సిద్దు, వైష్ణవి నటించిన జాక్ చిత్రం విడుదలవుతోంది.  అదే రోజు రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా విడుదలవుతున్నాయి.  అజిత్ హీరో గా వస్తోన్న గుడ్, బాడ్, అగ్లీ చిత్రం కూడా అదే రోజు వస్తోంది. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ వారి మొదటి తమిళ చిత్రం.  అదే రోజు సన్నీడియోల్ హీరో గా మన తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన జాట్ కూడా విడుదలవుతోంది.  ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫాక్టరీ తో కలిసి నిర్మిస్తోంది

ఏప్రిల్ 11 న యాంకర్లు  ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి హీరో, హీరోయిన్ గా వస్తోన్న అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి చిత్రం విడుదలవుతోంది. ఇదే రోజు మన బాలయ్య నటించిన మొదటి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఆదిత్య 369 ని మళ్ళీ విడుదల చేయనున్నారు. సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఏప్రిల్ 18 న ప్రియదర్శి నటించిన సారంగపాణి జాతకం సినీ విడుదలవుతోంది.  కోర్ట్ వంటి సూపర్ హిట్ తరవాత వస్తోన్న ప్రియదర్శి సినిమా మీద అంచనాలు కూడా బాగానే ఉన్నాయి.  ఏప్రిల్ 25 న మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కన్నప్ప (Kannappa) చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.  ఈ సినిమా హిట్ కావడం మంచు ఫామిలీ కి అనివార్యం. ఈ సినిమాలో మంచు విష్ణుతో పాటు అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్, మోహన్ బాబు, మోహన్ లాల్ లు నటిస్తున్నారు. వేసవి సెలవులను కన్నప్ప ఎలా వాడుకుంటాడో చూడాలి.  ఈ రోజు అంటే మార్చ్ 19 న మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మోహన్ బాబు పాత్ర తాలూకు లుక్ ను, పాటను విడుదల చేయనున్నారు మేకర్స్

ఇక మే 1 న, నాచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 విడుదలవుతోంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన హిట్ ఫ్రాంచైజ్ లో ఇది మూడవ భాగం.  ఇదే రోజు సూర్య నటించిన రెట్రో కూడా విడుదలవుతోంది

ఇక మే 9 న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallu) చిత్రం విడుదలవుతోంది. ఉప ముఖ్యమంత్రి అయ్యాక విడుదల అవుతోన్న పవన్ కళ్యాణ్ సినిమా. ఏ ఏం రత్నం సమర్పిస్తోన్న ఈ చిత్రానికి క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకులు

మే 30 న విజయ దేవరకొండ నటించిన కింగ్ డమ్ (Kingdom) సినిమా విడుదలవుతోంది. గతంలో నాని తో  జెర్సీ సినిమా   తీసిన గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకుడు