అల్లరి నరేష్ హీరో గా కాసరగడ్డ నాని దర్శకత్వంలో ఒక సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. మేకర్స్ ఈ చిత్రం టైటిల్ ని విడుదల చేశారు. ఈ చిత్రానికి 12 ఏ రైల్వే కాలనీ అని టైటిల్ పెట్టారు. ఈ నేపథ్యంలో టైటిల్ కు సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు మేకర్స్
పొలిమేర, పొలిమేర 2 చిత్రాలు రాసిన రచయిత ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ప్రాణాలతో బయటకు పోవుడు అవసరం లేదన్న అన్న నరేష్ సంభాషణతో సినిమా మీద అంచనాలు పెంచేశారు.
భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి స్వరాలూ సమకూరుస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై, శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు

