ఓటీటీలో ‘డ్రాగన్‌’.. అనుకున్న దానికంటే ముందే స్ట్రీమింగ్‌

by | Mar 11, 2025 | టీవీ & ఓటిటి

కోలీవుడ్ యంగ్ హీరో ‘లవ్‌ టుడే’ మూవీ ఫేమ్ ప్రదీప్‌ రంగనాథన్‌ కథానాయకుడుగా నటించిన తాజా చిత్రం ‘రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’. ‘ఓరి దేవుడా’ ఫేమ్ అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌, కయాదు లోహర్‌ హీరోయిన్లుగా నటించగా.. కల్పాతి ఎస్‌.అఘోరం, కల్పాతి ఎస్‌.గణేశ్‌, కల్పాతి ఎస్‌. సురేష్‌ నిర్మాతలుగా వ్యవహరించారు.. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం రూ. 35 కోట్లతో తెరకెక్కించిన డ్రాగన్‌ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. ‘రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’ మార్చి 14న హిందీలో విడుదలవుతుండగా తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ అప్ డేట్ వైరల్‌ అవుతుంది.

ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ మంచి రేటుకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ను ముందుగా చేసుకున్న ఒప్పదం ప్రకారం మార్చి 21 న స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడలో మార్చి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుందని నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది. ఇదిలాఉంటే.. ఈ సినిమా హీరో ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో ఉప్పెన ఫేం కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.