‘రాబిన్‌హుడ్‌’: ఉర్రూతలూగిస్తున్న ‘అది దా సర్‌ప్రైజు’

by | Mar 10, 2025 | సినిమా

టాలీవుడ్ యువ హీరో నితిన్, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్‌’. బ్యూటీ క్వీన్ శ్రీలీల (Sree Leela) కథనాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నవీన్‌ యేర్నేని, రవి శంకర్ నిర్మాతలుకుగా వ్యవహరిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు సాయి శ్రీరామ్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. వినోదం, సందేశంతో కూడిన యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. భీష్మ మూవీ త‌ర్వాత నితిన్ (NItin)- వెంకీ కుడుముల కాంబినేష‌న్‌లో ఈ సినిమా వ‌స్తుండ‌టంతో ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ జోరుగా చేస్తున్నారు.

ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘అది దా సర్‌ప్రైజ్’ అంటూ సాగే స్పెషల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటలో యంగ్ బ్యూటీ కేతిక శర్మ తన స్టెప్పులతో అలరించింది. కైపెక్కించే అందాలతో కేతిక శర్మ అభిమానులను అలరించింది. గతంలో కేతిక శర్మ రంగరంగ వైభవంగా, లక్ష్య లాంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.
ఇదిలాఉంటే.. ఈ సినిమాలో నితిన్ రాబిన్ హుడ్ (Robinhood) అనే దొంగ పాత్ర‌లో నటిస్తున్నాడు. అలాగే రాజేంద్రప్రసాద్‌ ఏజెంట్‌ జాన్ స్నో పాత్రలో కనిపించబోతుండగా.. ఇప్పటికే షేర్ చేసిన లుక్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెన్నెల కిషోర్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్‌ వార్నర్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.