ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత జట్టు న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించిన తరవాత, రోహిత్ శర్మ తన పాపా తో ఆడుకుంటుండగా, రోహిత్ ను పిలిచి కంగ్రాట్స్ చెప్పి, భారత జట్టు గెలిచిన ఆనందం లో రోహిత్ శర్మ కు అనుష్క శర్మ ఒక హగ్ ఇచ్చింది.
టీం ఇండియా కప్ గెలిచిన ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. ఇప్పటికే రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు రెండు ఐసీసీ ట్రోఫీ లను గెలుచుకుంది. వచ్చే ప్రపంచ కప్ గెలిస్తే ధోనీ సరసన ఇండియా అల్ టైం గ్రేట్ కెప్టెన్ గా చరిత్రలో రోహిత్ శర్మ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.
విరాట్ కోహ్లీ స్టాండ్ లో ఉన్న అనుష్క శర్మ దగ్గరకు వెళ్లి ఆనందంతో, ఎమోషనల్ గా హగ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియోలు సామజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి
భారత జట్టు మూడోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ని గెలుచుకుంది. భారత జట్టు గెలుపును దేశమంతా సంబరాలు చేసుకుంటోంది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ ని గెలుచుకుంది. ఇండియా… ఇండియా….

