టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, దసరా మూవీ ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమాను ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ‘ది పారడైజ్’ మూవీలో నాని (Natural Star Nani) సరికొత్త పాత్రలో మెస్మరైస్ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషనల్లో వచ్చిన ‘దసరా’ చిత్రం పలు అవార్డులను అందుకోవడంతో ఇప్పుడు రాబోతోన్న ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు ఏర్పడాయి. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ సినిమాలో సోనాలి కులకర్ణి కీలక పాత్రలో కనిపించనున్నారు. సికింద్రాబాద్ బ్యాగ్డ్రాప్ లో జరిగే కథగా శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇటీవల గ్లింప్స్ రిలీజ్ చేయగా.. అబిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ‘ది ప్యారడైజ్’ (The Paradise) మూవీ రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానుండగా.. రెండో పార్ట్ ఆ తర్వాత విడుదల అవుతుందని సమాచారం. ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం. కాగా, ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్, స్పానిష్ వంటి 8 భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

