హీరోగా రెండు, దర్శకుడిగా రెండు సినిమాలు ; అప్పుడే 100 కోట్ల క్లబ్ లోకి.
ప్రదీప్ రంగనాధన్. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తి. ఇంజనీరింగ్ చదివాడు. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉండేవాడు.
ఒక రోజు కోమలి అనే సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. ఈ సినిమా చివరలో ప్రదీప్ రంగనాధన్ కూడా కనిపిస్తాడు. కోమలి కమర్షియల్ హిట్ అయ్యింది
ఆ తరవాత, గతంలో తాను తీసిన ఒక షార్ట్ ఫిలిం ను బేస్ చేసుకుని లవ్ టుడే అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. లవ్ టుడే లో ప్రదీప్ రంగనాధన్ హీరో గా కూడా నటించాడు. ఒక చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది
ఆ తరవాత వచ్చిన సినిమా డ్రాగన్ (రిటర్న్ అఫ్ ది డ్రాగన్). ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ హీరో, అశ్వత్ మరిముత్తు దర్శకుడు. ఈ సినిమా ఫిబ్రవరి 21, 2025 న విడుదలై సంచలన విజయం సాధించింది. ఇప్పుడు డ్రాగన్ సినిమా ను ఈ మార్చ్ 14 న హిందీ లో కూడా విడుదల చేయనున్నారు.
హీరో గా నటించిన మొదటి రెండు సినిమాలు (లవ్ టుడే, డ్రాగన్ ), 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. డ్రాగన్ సాటిలైట్ హక్కులను జియో స్టార్ నెట్ వర్క్ వాళ్ళు దక్కించుకోగా, డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది
ప్రదీప్ రంగనాధన్ సినిమాలు అన్ని యూత్ కు ముఖ్యంగా కాలేజీ యువతను లక్ష్యంగా చేసుకున్న సినిమాలే. సినిమా ఎలాంటిదైనా, చివరలో ఒక సందేశం కూడా ఇస్తాడు. మొదటిసారి చూడగానే ధనుష్ లా ఉన్నాడనిపిస్తుంది

