మెగా స్టార్ చిరంజీవి ‘కొండవీటి దొంగ’ కు 35 ఏళ్ళు

by | Mar 9, 2025 | సినిమా

మెగా స్టార్ చిరంజీవి, రాధ, విజయ శాంతి, ,శారద, రావు గోపాలరావు, అమ్రిష్ పరి తదితరులు నటించిన చిత్రం కొండవీటి దొంగ.  1990 మార్చ్ 9 న కొండవీటి దొంగ విడుదలయ్యింది.  ఈ చిత్రానికి నేటితో 35 ఏళ్ళు

విజయలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై త్రివిక్రమరావు నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు ఎ కోదండరామి రెడ్డి.  పరుచూరి బ్రదర్స్ కధ, మాటలకు, యండమూరి వీరేంద్రనాథ్ స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఈ చిత్రానికి ఇళయరాజా స్వరాలూ సమకూర్చారు.

కధ : కొండవీడు ట్రైబల్ గ్రామస్థులు అందరు కలిసి రాజా (చిరంజీవి) ని ఐ ఎ ఎస్ చదివిస్తారు. చదువు పూర్తయి తన సొంత ఊరు అయిన కొండవీడుకు వచ్చిన రాజాకు ఇక్కడ జరుగుతున్న అవినీతి, అక్రమాల గురించి తెలుస్తుంది. గాడి తప్పిన న్యాయ వ్యవస్థనుండి తన ఊరి ప్రజలను కాపాడుకోవడానికి కొండవీటి దొంగ అవతారమెత్తుతాడు. అప్పట్లోనే రాబిన్ హుడ్ తరహా చిత్రం.  ఉన్నవాళ్లను కొల్లగొట్టి లేని వాళ్లకు పంచిపెట్టే ఈ కొండవీటి దొంగ ఈ ఊరి భూస్వాములనుండి, అవినీతి పరుల నుండి కొండవీడును ఎలా కాపాడాడు అనేదే ఈ కొండవీటి చిత్రం కధ

ఇళయరాజా స్వర పరచిన పాటలన్ని సూపర్ హిట్.  ఈ చిత్రంలోని పాటలను వేటూరి సుందర రామ్మూర్తి రాశారు.  ఈ చిత్రంలోని ‘శుభలేఖ రాసుకున్న’ పాటను రామ్ చరణ్ ‘నాయక్’ చిత్రం లో (అమల పాల్ కధానాయిక) రీ మిక్స్ చేశారు.  ఆ తరవాత చమక్కు చమక్కు పాటను సాయి దుర్గ తేజ్ నటించిన ‘ఇంటెలిజెంట్’ చిత్రం లో సాయి దుర్గ తేజ్, లావణ్య త్రిపాఠి పై రే మిక్స్ చేశారు

ఈ చిత్రం థియేటర్లలో సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో నాగబాబు అతిధి పాత్రలో చేశాడో. చిరంజీవి, నాగబాబు లకు మధ్య ఒక ఫైట్ ఉంటుంది.  ఈ సినిమాలో చమక్కు చమక్కు పాటలో చిరంజీవి కి చెమట పట్టి ఖర్చీఫ్ తో తుడుచుకోవడం అనేది పాటలో భాగంగా ఉంచేశారు. ఆది అప్పట్లో స్టైల్ స్వాగ్ అయింది

కొండవీటి దొంగ సినిమాకు ఐ ఎమ్ డి బి రేటింగ్ 7.2/10