టాలీవుడ్ కథానాయకుడు సుధీర్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం ‘జటాధర’. (Jatadhara) వెంకట్ కల్యాణ్ కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీని ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్‌బాబు ప్రొడక్షన్ బ్యానర్‌పై శివివన్ నారంగ్, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ నిర్మిస్తున్నారు. జటాధర సినిమా కథ అనంత పద్మనాభస్వామి ఆలయం చుట్టూ తిరుగనున్నట్లు తెలుస్తోంది. పద్మనాభ స్వామి సంపద దాని చుట్టూ అల్లుకున్న వివాదాల నేపథ్యంలో కథ సాగనుందని తెలుస్తోంది. జటాధర సినిమా కోసం సుధీర్ బాబు తన లుక్ ని కూడా మార్చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా కోసం సుధీర్ బాబు తన బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ చేసుకుంటున్నాడని, ఇందుకోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.
అయితే ‘జటాధర’ సినిమా ద్వారా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) టాలీవుడ్‌లోకి అడుగుపెడుతుంది. ఈ నేపథ్యంలోనే మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా జటాధర చిత్రబృందం సోనాక్షి సిన్హా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. అందులో ఈ సోనాక్షి చేతికి బంగారు గాజులు, కళ్లకు కాటుక ఉన్న జుట్టు విరబూసుకుని కోపంగా కనిపిస్తోంది. ఇదిలాఉంటే, టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ హీరోయిన్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభాస్ కల్కి సినిమాతో దీపికా పదుకొణె, ఎన్టీఆర్ (NTR) దేవర మూవీతో జాన్వీ కపూర్(Janhvi Kapoor) , విజయ్ దేవరకొండ లైగర్‌తో అనన్య పాండే టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు.

