ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది
మొదట బ్యటింగ్ చేసిన ఢిల్లీ జాయింట్స్ 5 వికెట్ల నష్టానికి 177 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఓపెనర్లు మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ లు మంచి శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ మొదటి వికెట్ కు 83 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 40 పరుగులు చేసిన షెఫాలీ వర్మ మేఘన సింగ్ బౌలింగ్ లో అవుట్ అయ్యింది
ఆ తరవాత వచ్చిన జొనాసేన్ 9 పరుగులు, జెమిమా రోడ్రిగ్స్ 4 పరుగులు చేసి అవుట్ అయ్యారు. అన్నా సదర్లాండ్ 8 బంతుల్లో 14 పరుగులు చేసి అవుట్ అయ్యింది. ఒక వైపు వికెట్లు పడుతున్న ఓపెనర్, కెప్టెన్ మెగ్ లానింగ్ స్కోర్ బోర్డు ను పరిగెత్తిస్తూనే ఉంది. మెగ్ లానింగ్ 57 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 92 పరుగులు చేసి అవుట్ అయ్యింది. బ్రైస్ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్సర్ కొట్టింది
గుజరాత్ జెయింట్స్ బౌలర్ల లో మేఘన సింగ్ మూడు వికెట్లు, డాటిన్ రెండు వికెట్లు తీశారు.
అనంతరం 178 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ జెయింట్స్ ఓపెనర్ హేమలత ఒక పరుగు చేసి అవుట్ అయ్యింది. ఆ తరవాత వన్ డౌన్ లో వచ్చిన హర్లీన్ డియోల్ తో జత కలిసిన మరో ఓపెనర్ బెత్ మూనీ రెండవ వికెట్ కు 85 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఓపెనర్ మూనీ 35 బంతుల్లో 44 పరుగులు చేసి అవుట్ అయ్యింది.
ఆ తరవాత వచ్చిన కెప్టెన్ గార్డనర్ ధాటిగా ఆడే ప్రయత్నంలో 13 బంతుల్లో 22 పరుగులు చేసింది. అయితే వన్ డౌన్ లో వచ్చిన హర్లీన్ డియోల్ మాత్రం నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డు ను కదిలిస్తూ వచ్చింది. ఆ తరవాత వచ్చిన డాటిన్, హర్లీన్ డియోల్ తో కలిసింది. ఇద్దరు భారీ షాట్ లు ఆడుతూ స్కోర్ బోర్డు ను పెరిగెత్తించారు
డాటిన్ చెలరేగిపోయింది. కేవలం 10 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 24 పరుగులు చేసి అవుట్ అయ్యింది. ఆ తరవాత వచ్చిన లిచ్ ఫీల్డ్ డక్ అవుట్ అయ్యింది. ఆడిన మొదటి బంతికే అవుట్ అయ్యింది
ఆ తరవాత వచ్చిన కాశ్వీ తో కలిసిన హర్లీన్ డియోల్ గుజరాత్ జెయింట్స్ ను గెలిపించింది. వన్ డౌన్ లో వచ్చిన హర్లీన్ డియోల్ చివర వరకు నిలబడి 49 బంతుల్లో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఈ ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. కీలక సమయంలో కాశ్వీ గౌతమ్ ఒక సిక్సర్ కొట్టి ఒత్తిడిని తగ్గించింది
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల లో శిఖా పాండే, జొనాసేన్ లు రెండేసి వికెట్లు తీయగా, మిన్ను మని ఒక వికెట్ తీసింది

