మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దేవర పార్టు 1 గతేడాది సెప్టెంబర్ 27న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా దాదాపు రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇప్పుడు ఇదే సినిమా జపాన్‌లో విడుదల కానుండడం విశేషం. ఎన్టీఆర్ సినిమాలకు జపాన్‌లో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడ రిలీజైన బాద్‌షాతో పాటు ఆర్ఆర్ఆర్ సినిమాలు బాక్సఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే దేవర సినిమా జపాన్‌లో మార్చి 28న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే దేవర పార్ట్ 2కి సంబంధించిన క్రేజీ అప్ డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది చివర్లో ‘దేవర 2’ మూవీ చిత్రీకరణ ప్రారంభం కానుందని సమాచారం. ఇందుకోసం ఎన్టీఆర్ డేట్స్ కూడా ఇచ్చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్-ప్రశాంత్‌నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాను డిసెంబర్‌లోపు పూర్తి చేయాలని ఎన్టీఆర్ కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు డైరెక్టర్ ప్రశాంత్‌నీల్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ ‘దేవర 2’ ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ నాటికి ‘దేవర 2’ షూటింగ్ మొదలుపెట్టేందుకు పనులు జరుగుతున్నట్లు సమాచారం. కాగా, దేవర మూవీలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా టాలీవుడ్ కు పరిచయమైంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించగా.. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా సినిమాను నిర్మించాయి. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం అందించారు.

