అసెంబ్లీ సాక్షిగా సినిమా టికెట్ ధరలు నిర్ణయించిన కర్ణాటక ప్రభుత్వం
కర్ణాటక ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీ లో 2025-26 బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య (Karnataka Chief Minister Siddaramayya) ఈ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. కర్ణాటక ప్రభుత్వ బడ్జెట్ ను 16 వ సారి ప్రవేశ పెట్టిన ఘనత కర్ణాటక ప్రభుత్వ ముఖ్యమంత్రి సిద్దరామయ్యది
అయితే ఈ సారి బడ్జెట్ లో కన్నడ (Kannada) సినీ పరిశ్రమ కు సంబంధించి పలు ప్రకటనలు చేశారు కర్ణాటక ప్రభుత్వ ముఖ్యమంత్రి సిద్దరామయ్య
సినిమా అనేది అందరికి అందుబాటులో ఉండాలి అని టికెట్ ధరలను (Cinema Ticket Rates) 200 రూపాయలుగా నిర్ణయించారు. సింగల్ స్క్రీన్స్ అయినా, మల్టీ ప్లెక్స్ లు ఆయినా ఇదే ధర అని అన్నారు
ఇక రెండవది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఒక ఓ టి టి (Exclusive Kannada OTT platform) ప్లాట్ ఫామ్ ను తీసుకురానున్నారు. ఈ ప్లాట్ ఫామ్ కన్నడ సినిమాలను స్ట్రీమింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు
మైసూర్ (Mysore) లో, 500 కోట్లతో, అంతర్జాతీయ స్థాయిలో ఒక ఫిలిం సిటీ ని (Film City) నిర్మించ తలపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ ఫిలిం సిటీ నిర్మాణంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం ఉంటుంది. అంటే పీపీపీ మోడల్ అన్నమాట
కన్నడ సినిమాకి ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చేసినా బడ్జెట్ కేటాయింపులపై పలువు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుండి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి. ఇటీవలే రష్మిక మందాన ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమానికి నిరాకరించడంతో ప్రభుత్వం సినీ పరిశ్రమను తన ఆధీనంలోకి తీచుకోవాలనే ప్రయత్నం చేయడం లేదు కదా అన్న ఆలోచన కూడా వస్తోంది
కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రానున్న రోజుల్లో తెలంగాణ మీద ఎలాంటి ప్రభావం చూపుతోందో అనేది వేచి చూడాలి. ఎందుకంటీ తెలంగాణ లో ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ కాంగ్రెస్ కూడా కొన్ని కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన హామీలు, పథకాలతో ఇక్కడ ఎన్నికలలో గెలిచింది కాబట్టి. అంతే కాకుండా తెలంగాణాలో కూడా టికెట్ రేట్లు పెంచబోమని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు కావున, కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాల ప్రభావం తెలంగాణాలో కూడా పడే అవకాశం ఉంది

