టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ (Sharwanand) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఇందులో ఒకటి సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు బాలయ్య ఆల్ టైమ్ సూపర్ హిట్ మూవీ నారీ నారీ నడుమ మురారి (Nari Nari Naduma Murari) టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో సంయుక్తా మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తుండగ.. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఇక శర్వానంద్ హీరోగా చేస్తున్న మరో సినిమా అభిలాష్ కంకర దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాళవికా నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘శర్వా36’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకున్నది. త్వరలోనే టైటిల్‌ని ప్రకటించనున్నారు. ఈ చిత్రాన్ని విక్రమ్ సమర్పణలో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.
ఇక శర్వానంద్ (Sharwanand) నటిస్తున్న 38వ చిత్రాన్ని కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. సీనియర్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించనున్నారట. కాగా, గురువారం (మార్చి 6) శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మూడు సినిమాల నుంచి కొత్త పోస్టర్స్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ మూడు చిత్రాలతో శర్వానంద్ తన ఫ్యాన్స్ కు ఈ ఏడాది త్రిపుల్ ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు గతేడాది శర్వానంద్ హీరోగా నటించిన ‘మనమే’ (Maname) మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద తెలిపోయిన ఈ సినిమా ఇప్పటి వరకూ ఓటీటీలో రిలీజ్ కాలేదు. అయితే ఈ సినిమాను మార్చి 7 నుండి అమెజాన్ (Amazon) ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోందని తాజాగా ప్రకటించారు మేకర్స్.


