టాలీవుడ్ యువ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) దర్శకుడు ప్రదీప్ చిలుకూరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. #NKR21 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీకి సంబంధించి సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కాగా, ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్‌ను మార్చి 8న శనివారం రాబోతోందని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ క్రమంలోనే కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి (Vijayashanti) పవర్ఫుల్ రోల్ చేస్తున్నారని సమాచారం. కొన్నేళ్ల విరామం తర్వాత ఆమె మహేశ్‌బాబు (Mahesh Babu) నటించిన సరిలేరు నీకెవ్వరూ’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ తర్వాత ఇప్పుడు కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్ర చేయడానికి అంగీకరించారు.
అలాగే ఇందులో శ్రీకాంత్, సాయి మంజ్రేకర్, యానిమల్ ఫేమ్ పృథ్వీవీరాజ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ మూవీ నుంచి కల్యాణ్ రామ్ (Kalyan Ram) ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అభిమానుల్ని ఆకట్టుకుంది. యాక్షన్ త్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముందుగా మెరుపు, రుద్ర, అర్జున్ సన్నాఫ్ వైజయంతి అనే టైటిల్స్ ను అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ సినిమాకు తమ్మిరాజు ఎడిటర్‌గా, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా, అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు

