మహిళా దినోత్సవ కానుకగా ప్రియాంక చోప్రా ఫ్యాషన్ మూవీ

by | Mar 6, 2025 | వార్తలు

మహిళా దినోత్సవం సందర్భంగా పి వి ఆర్, ఐనాక్స్(PVR Inox) మార్చ్ 7 నుండి 13 వరకు మహిళా ప్రాధాన్య చిత్రాలను ప్రదర్శించడానికి సంకల్పించింది. 

ఈ క్రమంలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటించిన ఫ్యాషన్ (Fashions) సినిమాని ప్రదర్శిస్తున్నారు.  మధుర్ బండార్కర్ నటించిన ఈ సినిమా అప్పట్లో గొప్ప విజయాన్ని సాధించింది. ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్ లకు నేషనల్ అవార్డ్స్ కూడ వచ్చాయి.  ఒక స్మాల్ టౌన్ గర్ల్ సూపర్ మోడల్ ఎలా అయింది అనేది చిత్ర కధ

ఈ ఫ్యాషన్ చిత్రంతో పాటు క్వీన్, హైవే చిత్రాలను కూడా మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు