ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ జట్ల జరుగుతున్న రెండవ సెమి ఫైనల్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్ల లో న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్ చేసింది
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ కు చక్కని శుభారంభం లభించింది. ఓపెనర్ లు విల్ యంగ్, రచిం రవీంద్ర మొదటి వికెట్ కు 48 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు
ఓపెనర్ విల్ యంగ్ 21 పరుగులు చేసి ఎంగిడి బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తరవాత వచ్చిన విలియమ్సన్ తో జత కలిసిన రచిన్ రవీంద్ర అద్భుతం గా ఆది రెండవ వికెట్ కు వీరిద్దరూ 164 పరుగులు జోడించి న్యూజిలాండ్ ను పటిష్ట స్థితిలో పెట్టారు.
సెంచరీ లు పూర్తిచేసుకున్న తరవాత రచిన్ రవీంద్ర, విలియమ్సన్ లు వెంట వెంటనే అవుట్ అయ్యారు. విలియమ్సన్ 102 పరుగులు, రచిన్ రవీంద్ర 108 పరుగులు చేసి అవుట్ అయ్యారు
లేదమ్ నాలుగు పరులుగలకే అవుట్ అయ్యిన, మిచెల్, ఫిలిప్స్ లు ఐదవ వికెట్ కు 57 పరుగులు జోడించారు. 37 బంతుల్లో 49 పరుగులు చేసిన మిచెల్ అర్ధ సెంచరీ ని ఒక పరుగుతో మిస్ చేసుకున్నాడు. గ్లెన్ ఫిలిప్స్ 27 బంతుల్లో 49 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు
సౌత్ ఆఫ్రికా బౌలర్ల లో ఎంగిడి మూడు , రబడా రెండు వికెట్లు తీయగా ముల్డర్ ఒక వికెట్ తీశాడు.

