అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరో గా నటించిన ఏజెంట్ (Agent) చిత్రం ఎట్టకేలకు ఓ టి టి లోకి రాబోతోంది. ఏజెంట్ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. థియేటర్లలో ఈ చిత్రం అట్టర్ ప్లాప్ అయింది
ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక ప్రత్యేక పాత్రలో నటించాడు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్ 2023 ఏప్రిల్ లో థియేటర్లలో విడుదలైంది. విడుదలైన సుమారు రెండేళ్లకు ఓ టి టి లో విడుదల చేస్తున్నారు
ఎప్పటినుండో ఎదురు చూస్తోన్న ఈ ఏజెంట్ చిత్రం మార్చ్ 14 నుండి సోనీ లివ్ (Sony Liv) లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని సోనీ లివ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది

