తెలుగు సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ 

by | Mar 3, 2025 | సినిమా

ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్ తెలుగు సినిమా పాటలకు డాన్స్ లు చేయడం.  భారతీయ సినిమాలను ఇమిటేట్ చేయడం వంటివి చేస్తుంటాడు. తెలుగు సినిమాలంటే డేవిడ్ వార్నర్ కు ఎంత ఇష్టమో తెలుస్తుంది.

డేవిడ్ వార్నర్ పుష్ప ల గెట్ అప్ వేసుకోవడం చూసే ఉంటాము.  తెలుగు సినిమా క్యారెక్టర్ డేవిడ్ వార్నర్ మీమ్స్ కూడా చేశాము.

ఇప్పుడు డేవిడ్ వార్నర్ మొదటి సారి భారతీయ సినిమాలో నటిస్తున్నాడు.  అది కూడా మన తెలుగు సినిమాలో నటిస్తున్నాడు.

జి వి ప్రకాష్ కుమార్ హీరో గా వస్తోన్న కింగ్ స్టన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ మాట్లాడుతూ రాబిన్ హుడ్ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటిస్తున్నాడని లీక్ చేశారు. ఈ రాబిన్ హుడ్ సినిమాలో డేవిడ్ వార్నర్ చిన్న పాత్ర లో నితిన్ తో నటిస్తున్నాడు. రాబిన్ హుడ్ మార్చ్ 28 న విడుదలవుతోంది