నేచురల్ స్టార్ నాని(Nani), దసరా (Dussera) మూవీ ఫేం శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్'(The Paradise). ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ‘ది పారడైజ్’ మూవీలో నాని సరికొత్త పాత్రలో మెస్మరైస్ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషనల్‌లో వచ్చిన ‘దసరా’ చిత్రం పలు అవార్డులను అందుకోవడంతో ఇప్పుడు రాబోతోన్న ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు ఏర్పడాయి. ఈ క్రమంలోనే శ్రీకాంత్ ఓదెల ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని పాయింట్‌ను తీసుకుని ఈ సినిమా చేయనున్నాడనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.
తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ క్రమంలోనే ‘ది ప్యారడైజ్’ మూవీ నుంచి రా స్టేట్‌మెంట్ మార్చి 3న రాబోతుందంటూ ఈగల్ పోస్టర్ ను డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల షేర్ చేశాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎనిమిది భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక ‘ది ప్యారడైజ్’ మూవీ గ్లింప్స్‌ని కూడా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, కన్నడ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.
కాగా, ఈ సినిమాలో నానికి జోడీగా నటించబోతున్న హీరోయిన్ ఎవరు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందింస్తున్నారు.

