‘కన్నప్ప’ టీజర్ రిలీజ్.. ‘రుద్ర’గా ప్రభాస్ అదరహో

by | Mar 1, 2025 | సినిమా

విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ (Kannappa) మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేశ్‌ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇందులో హీరోయిన్ గా ‘ఓం భీమ్ బుష్’ ఫేమ్ ప్రీతి ముకుందన్ నటిస్తోంది. అక్షయ్ కుమార్ (Akshay Kumar) శివుడిగా, కాజల్ (Kajal)పార్వతీ దేవిగా అలరించబోతున్నారు. అలానే మోహన్ బాబుతో పాటు మోహన్ లాల్, శరత్ కుమార్ , బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఈ సినిమాలో రుద్ర పాత్రను పోషించారు. పలు ఇండస్ట్రీలకు చెందిన యాక్టర్స్ ఈ మూవీలో నటిస్తుండటంతో సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ఈ మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, వీడియో గ్లింప్స్, వీడియో లిరికల్ సాంగ్ ఇటీవల విడుదలవగా.. అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. 01.25 నిమిషాల నిదివిగల ఈ టీజర్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. శంకరుడి సైన్యం ఎక్కడో సన్నద్ధమై ఉంటుంది అనే డైలాగ్ మోహన్ బాబు పలాగ్గా.. టీజర్ చివర్లో నుదుటిన విబూదితో శివభక్తుడైన రుద్రగా ప్రభాస్ కనిపించడం టీజర్ మొత్తానికే హైలెట్ గా నిలిచింది. కాగా, పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ పని చేస్తున్నారు.