అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. భారత దేశం లో ఎవరినో గెలిపించడానికి గత అధ్యక్షుడు బైడెన్ 182 కోట్లు కోట్లు కేటాయించారని ఆరోపించారు.
అంతే కాకుండా గత అధ్యక్షుడు బైడెన్ భారత దేశం లో ఓటింగ్ ను పెంచడం ద్వారా ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించారు అని డొనాల్ ట్రంప్ తీవ్రమైన ఆరోపణలు చేశారు
మీడియా దీని మీద పెద్ద దృష్టి పెట్టలేదు. ట్రంప్ చేసిన ఆరోపణలు మాత్రం చాలా తీవ్రమైనవి. ట్రంప్ ఆరోపణలపై భాజపా స్పందించింది. రాహుల్ గాంధీ, విదేశీయులు చెప్పినట్లు చేస్తున్నారని భాజపా తీవ్రంగా స్పందించింది. అయితే యధావిధిగా కాంగ్రెస్ పార్టీ ఇవి అర్ధం లేని ఆరోపణలని కొట్టిపారేసింది.
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని, డిపార్ట్మెంట్ అఫ్ గవర్నమెంట్ ఎఫిసియన్సీ (DOGE) ఈ నెల 16 న విడుదల చేసిన జాబితాలో ఉన్న భారత దేశంలోని ఓటర్లను పెంచడానికి కేటాయించిన నిధులను రద్దు చేసినట్లు చూపించింది
అమెరికా ఫస్ట్ అనే నినాదం తో ఎన్నికల్లో గెలిచిన ట్రంప్, అధ్యక్షుడు అయ్యాక అమెరికా ప్రజలకు మేలు చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా ఉక్రెయిన్ తో యుద్ధం మీద అనవసర ఖర్చు చేశారని బైడెన్ ని ఎన్నికలలో దుయ్యబట్టారు. ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టిన అది అమెరికన్ల కోసం ఖర్చు పెట్టాలని దూకుడు మీద నిర్ణయాలు తీసుకుంటున్నారు. భారత దేశంలో ఓటర్ ల సంఖ్యను పెంచడానికి మనం ఎందుకు ఖర్చు పెట్టాలి. ఎవరిని గెలిపించడానికి బైడెన్ ప్రభుత్వం ఈ నిధులను ఖర్చు పెట్టాలనుకుంది, అని ట్రంప్ తీవ్రంగా ఆరోపించారు
కాంగ్రెస్ పార్టీ, భాజపా లు ఈ విష్యం పై ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే ఈ విషయం పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జై రమేష్ అమెరిగా నుంచి లబ్ది పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల గురించి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్, భాజపా ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం మానేసి ట్రంప్ చేసిన ఆరోపణల్లో నిజా నిజాలు నిర్ధారించాలి. ఎందుకంటె, ఇక్కడ, సమస్య రాజకీయ పార్టీల మధ్య కాదు. రెండు దేశాల మధ్య.
అసలే ట్రంప్ దూకుడు మీద ఉన్నాడు. అక్రమ వలసదారులను వెనక్కి పంపిస్తున్నాడు, భారత దేశంలో ఓటర్ల సంఖ్యని పెంచడానికి అమెరికా నిధుల విషయం వంటి ఆరోపణలు, సుంకాలు పెంచడం వంటి పరిణామాలు ఏ మాత్రం మంచివి కావు.
ఆశ్చర్యకరంగా, ఎందుకో, మీడియా, ఈ విషయం గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు

