శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో రోడ్డు మార్గం, షెల్టర్ లేక దహన సంస్కారాలు నిర్వహించడానికి దశాబ్దాలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఎస్ సి సామజిక వర్గానికి చెందిన వివేక్( @చిరుసచిన్ 1) అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ ను టాగ్ చేస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టారు
ఈ పోస్ట్ కు వెంటనే స్పందించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు మీ సమస్యను మా దృష్టి కి తీసుకు వచ్చినందుకు ధన్యవాదాలు అని అన్నారు. అంతే కాకుండా మా ఆఫీస్ వాళ్ళు సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కారించామని చెపుతాను అని రిప్లై ఇచ్చారు.
సంబంధిత అధికారులతో మాట్లాడి, దీనికి సంబంధించిన పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయించి దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్యను తీర్చారు మన ప్రియతమ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు.
దీనికి వివేక్ అనే వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి షెల్టర్ వర్క్ కంప్లీట్ అయిందని, మీకు జీవిత కాలం రుణపడి ఉంటామని రిప్లై ఇచ్చాడు. అంతే కాకుండా తెలుగు దేశం పార్టీ స్థానిక నాయకులు అయిన రాంబాబు గారికి, గౌరీ నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపాడు సదరు వ్యక్తి. అంతే కాకుండా మేము ఎలాంటి సమస్యను పేస్ చేసాము, ఆ సమస్య ఎలా తీరింది అనే దానిపై ఓకే షార్ట్ వీడియో చేస్తానని ఆ వ్యక్తి ఎపి డిప్యూటీ సీఎంఓ కి టాగ్ చేస్తూ రిప్లై ఇచ్చాడు


