గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఇటీవల ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించిన గేమ్ ఛేంజర్ మూవీ 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి తీవ్రంగా నిరాశ పరిచింది. దాంతో ప్రస్తుతం అందరి దృష్టి ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌సీ16 సినిమాపై ఉంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘ఆర్‌సీ16’ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ (Sukumar) రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అయితే, తాజాగా ‘ఆర్‌సీ16’ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోండగా.. ఈ సినిమా విడుదల కూడా ఈ ఏడాదిలోనే చేయాలని మేకర్స్ బావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం రిలీజ్ డేట్ ను కూడా లాక్ చేసినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘ఆర్‌సీ16’ మూవీ
ఈ ఏడాది అక్టోబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దీని మీద త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానున్నట్లు తెలుస్తోంది.
కాగా, కుస్తీతో పాటు క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. జాన్వీకపూర్‌కు దేవర తర్వాత తెలుగులో ఇది రెండో సినిమా. ఈ సినిమాకు తంగలాన్ ఫేం ఏగన్ ఏకాంబరం కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

