‘స్పిరిట్’ షూటింగ్ డేట్ ఫిక్స్‌..ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఎపిక్ సర్ప్రైజ్

by | Feb 19, 2025 | సినిమా

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం ‘ది రాజాసాబ్‌’ (Raja Saab) ‘ఫౌజీ’ సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్‌’ (Spirit) షూటింగ్‌లో జాయిన్‌ కాబోతున్నారు. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో రానున్న ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మించ‌నున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ పనులను పూర్తి చేసే పనిలో దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను ఈ సినిమా సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ పంచుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. చెప్పుకొచ్చాడు. స్పిరిట్ మూవీకి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఈ సినిమా కోసం నాలుగు కొత్త ట్యూన్స్ సిద్ధం చేశాను. స్పిరిట్ సినిమాను తెలుగు వారి నూతన సంవత్సరం అయిన ఉగాది పండుగ రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నాం. ఇందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ మొదటి వారంలో మొదలు కానుంది అని హర్షవర్ధన్ రామేశ్వర్ పేర్కొన్నారు.

ఇక స్పిరిట్ మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. దీన్ని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీని నిర్మించబోతున్నారు. సినిమాలో ప్రభాస్ పవర్​ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. సినిమాలో యాక్షన్ డోస్ హై రేంజ్​లో ఉండనుందని తెలుస్తోంది.