టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల మహా కుంభమేళాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రయాగ్ రాజ్‌లో విజయ్ దేవరకొండ తన తల్లి మాధవితో కలిసి పవిత్ర స్నానం చేసిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. మహాకుంభ్ మేళాకు వెళ్లిన విజయ్ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ తాజాగా ఆయన ఎక్స్ వేదికగా ఫొటోలు పంచుకున్నారు. “మహా కుంభమేళా-2025 నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మన సంప్రదాయాలను గౌరవించుకోవడానికి ఇదో అవకాశం. నా స్నేహితుల బృందం ఈ ప్రయాణాన్ని మరింత మధురంగా మార్చేసింది. మా అమ్మతో కలిసి పూజల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. నా ఫేవరేట్ ఫ్రెండ్స్ తో కలిసి కాశీ యాత్రకి వెళ్లొచ్చాను” అంటూ విజయ్ దేవరకొండ రాసుకొచ్చాడు.
కాగా, కాశీ విశ్వనాథ స్వామి ఆలయం దగ్గర విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఫోటోల్లో
అతనితో పాటు తల్లి మాధవి, అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి, దర్శకుడు వంశీ పైడిపల్లి, కొందరు స్నేహితులు కూడా ఉన్నారు. ఇదిలాఉంటే.. ప్రస్తుతం విజయ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘కింగ్డమ్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా మే 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ నుండి ఇటీవలే విడుదలైన టీజర్ వరకు ప్రతీది సినిమాపై అంతకంతకు అంచనాలను పెంచుతూనే ఉన్నాయి.
https://www.instagram.com/p/DGKxWarMiwl/?utm_source=ig_web_copy_link

