బందిపోట్లు, స్మగ్లర్ లపై సినిమాలు వద్దన్న మంత్రి సత్యకుమార్

by | Feb 15, 2025 | రాజకీయాలు

భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుడు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, మెడికల్ విద్య కు సంబంధించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ నంద్యాల లో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు

బందిపోట్లు, స్మగ్లర్ ల జీవితాలపై సినిమాలు తీయవద్దని తెలుగు సినిమా వాళ్లకు విజ్ఞప్తి చేశారు. బందిపోట్లు, స్మగ్లర్ ల జీవితాలపై తీసే సినిమాలు సమాజానికి మంచివి కాదని అని అన్నారు.

అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా మీద గతం లో ఇలాంటి వ్యాఖ్యలు చాలా మంది చేశారు.  ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం , మంత్రి సీతక్క ఇలానే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇప్పుడు పరోక్షం గా బాల కృష్ణ డాకు మహారాజ్ గురించే మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడారని పలువురు అభిప్రాయపడుతున్నారు

పుట్టిన ఊరు, సమాజం కోసం కష్టపడే వాళ్ళ జీవితాలను సినిమాలుగా తీయాలని అన్నారు. సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాలి అని అన్నారు

అంతకు ముందు ఆయన కూటమిలో విభేదాలపై కూడా మాట్లాడారు.కూటమి నేతల మధ్య దూరం పెరుగుతోందన్న వార్తలను కొట్టి పడేశారు. ఒక్కోసారి కొన్ని సమావేశాలకు కొంత మంది రాకపోవచ్చు అంత మాత్రాన దూరం పెరుగుతొందనడం సరికాదు