తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి గా మీనాక్షి నటరాజన్ ని నియమిస్తున్నట్లు కె సి వేణు గోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ టీం లో పని చేసిన కీలక సభ్యులలో ఒకరు. ప్రస్తుతం అధ్యక్షురాలిగా ఉన్న దీపదాస్ మున్షి స్థానం లో మీనాక్షి నటరాజన్ ని నియమించారు. మీనాక్షి నటరాజన్ నిజాయితీ గల వ్యక్తిగా మంచి పేరు ఉంది.
అయితే కొత్త తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
- కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకం గా చేపట్టిన కుల గణన విమర్శల పాలైంది. సొంత పార్టీ లో వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. తీన్ మార్ మల్లన్న బహింరంగంగానే గళం విప్పారు. అయితే దీనిపై పార్టీ షో కాజ్ నోటీసు లు జారీ చేసింది. కుల గణన మీద బి ఆర్ ఎస్ పార్టీ, భాజపా పార్టీ ల విమర్శలకు అధికార పార్టీ వద్ద సరైన సమాధానం లేదు. బీసీ ల శాతాన్ని తగ్గిస్తున్నారు అని విమర్శల పాలైంది
- సొంత పార్టీ లో క్యాడర్ ను సంతృప్తి పరుస్తూ ఏం ఎల్ ఎ లకు, మంత్రుల కు మధ్య ఉన్న గ్యాప్ ను తుడిచేయడం పెద్ద సవాల్.
- బి ఆర్ ఎస్ పార్టీ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన నాయకులపై వేసిన కేసులు కాంగ్రెస్ కు ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నాయి
- స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచి తీరాల్సిన పరిస్థితి. కులగణన ప్రభావం స్థానిక సంస్థలపై పడే అవకాశం ఉంది
- మరి ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి దూకుడు కూడా కొంత పార్టీ కి
ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రం మీద, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మీద చేసే కామెంట్ లు తెలంగాణ అభివృద్ధి కి ప్రతిబంధకాలుగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఈ బడ్జెట్ లో కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు ఏమి రాలేదు. పార్టీ, ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ అభివృద్ధి మీద దృష్టి సారించాలి. అది సాధ్యమయ్యే పనేనా
- ఈ సారి అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని భాజపా చాలా పట్టుదలతో కనిపిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విజయంతో భాజపా శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇక్కడ కూడా డబల్ ఇంజిన్ సర్కార్ మంత్రం వెళ్లే అవకాశం ఉంది
- బి ఆర్ ఎస్ పార్టీ కూడా దూకుడు పెంచుతోంది. అవకాశం వచ్చినప్పుడల్లా, కాంగ్రెస్ పార్టీ ని, ప్రభుత్వాన్ని ఎండ కడుతోంది. ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం వాళ్ళ రాష్ట్రం పై ఆర్ధిక భారం పడుతోంది. దీనిపై ఆటో వాళ్ళు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నారు. అంతే కాకుండా పట్టంలో ఉచిత బస్సు ప్రయాణం మీద ప్రజలలో అంత మంచి అభిప్రాయం లేదు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక (పదేళ్ల తరవాత) మొదటి సారి అధికారంలో కి వచ్చిన కాంగ్రెస్ నిలబడాలంటే వచ్చే నాలుగేళ్ల పరిపాలన చాలా ముఖ్యం.
ముఖ్యంగా పార్టీ లో కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ, ఏం ఎల్ ఎ లను, మంత్రుల ను సమన్వయ పరుస్తూ, స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్ష్యం గా, ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోవడం, కేంద్ర ప్రభుత్వం తో సమన్వయము వంటి అంశాలు మీనాక్షి నటరాజన్ ముందు ఉన్న సవాళ్లు

