ఆధార్ కార్డు గురించి అందరికి తెలిసిందే. ఆధార్ కార్డు లాంటిదే ఈ అపార్ కార్డు లేదా అపార్ ఐడి
దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ, పై చదువులు చదివేవారందరికి అపార్ ఐడి తప్పని సరి గా తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది.
దేశవ్యాప్తం గా ఉన్న విద్యార్థులందరికీ వన్ నేషన్, వన్ స్టూడెంట్’ పేరుతో 12 అంకెల ఆటోమేటెడ్ పెర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) గుర్తింపు నెంబర్ ఇవ్వాలని కేంద్ర విద్యాశాఖ గతంలోనే నిర్ణయించింది. అయితే ఈ విషయానికి తగిన ప్రచారం లేకపోవడం తో, ఎవరు అపార్ ఐడి అంతగా పట్టించుకోలేదు
ఈ అపార్ ఐడి ఇవ్వాలంటే దానికి ఆధార్ కార్డు నమోదు తప్పనిసరి. అంతే కాదు నమోదు చేసే ముందు స్కూల్ టీచర్స్ పేరెంట్స్ నుండి అనుమతి పత్రం తీసుకోవాలి. విద్యార్థులకు, వారి తల్లి తండ్రులకు ఈ అపార్ ఐడి తెలియచేయాల్సిన బాధ్యత స్కూల్, కాలేజీ ల యాజమాన్యాలపై ఉంటుంది
అపార్ ఐడి ఉండడం వలన, విద్యార్థి ఒక స్కూల్ నుండి మరో స్కూల్ కి ట్రాన్స్ఫర్ అవడం సులభమవుతుంది. ఈ అపార్ ఐడి వలన విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించినప్పుడు వచ్చిన క్రెడిట్లను అకాడమిక్ బ్యాంకు అఫ్ క్రెడిట్స్ లో పొందుపరుచుకోవచ్చు. ఒక కాలేజీ నుండి, మరో కాలేజీ కి, ఒక స్టేట్ నుండి వేరే స్టేట్ కి సులభంగా బదిలీ అవవచ్చు, ఈ క్రెడిట్ లను కూడా బదిలీ చేసుకోవచ్చు.
సింపుల్ గా చెప్పాలంటే ఈ అపార్ ఐడి లో విద్యార్థుల ఎడ్యుకేషన్ ప్రొఫైల్ మొత్తం ఉంటుంది. ఎక్కడ ఏం చదివాడు, ఎన్ని మార్కులు వచ్చాయి, ఏం సాధించాడు, విద్యార్థికి స్కోర్ ఎంత వచ్చిన అనే విషయాలు ఈ ఆఫర్ ఐడి పొందుపరుస్తారు. మీ పిల్లలు అపార్ ఐడి లేకపోతే ఈ రోజే స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి త్వరితగతిన ఈ అపార్ ఐడి కి అప్లై చేయండి. ముందు, ముందు పడవ తరగతి పరిసుఖాలకు ఈ అపార్ ఐడి తప్పనిసరి చేస్తారు

