చిరు ‘విశ్వంభర’ వచ్చేది అప్పుడే!

by | Feb 13, 2025 | సినిమా

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్​తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలై టీజర్​ మెగా అభిమానుల్లో తెగ ఆసక్తి పెంచింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్​లో శరవేగంగా జరుగుతుంది. ఇప్పటి వరకూ పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. వాస్తవానికి ‘విశ్వంభర’ సినిమాను తొలుత ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ, ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ‘విశ్వంభర’ విడుదల ఆగిపోయింది.

ఈ క్రమంలోనే ‘విశ్వంభర’ మూవీని సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్రబృందం ప్రకటించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ‘విశ్వంభర’ మూవీ రిలీజ్ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు పూర్తవడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉండడంతో మరింత ఆలస్యం కానుందట. దాంతో పాటుగా ‘విశ్వంభర’ మూవీ డిజిటల్ రైట్స్‌ను మంచి ధరకు అమ్మాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో ‘విశ్వంభర’ మూవీ అనుకున్న దాని కంటే మరికొంత ఆలస్యంగా రిలీజ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

కాగా, ‘విశ్వంభర’ సినిమాలో త్రిష, అషికా రంగనాథ్‌, మృణాల్ ఠాకూర్, కునాల్‌ కపూర్‌, జాన్వీ కపూర్ కీలక పాత్రలు పోషించనుండగా.. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్​పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, శ్రీ శివశక్తి దత్తా, చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు.