నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శైలేశ్ కొలను కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘హిట్’: ది థర్డ్ కేస్’. క్రైమ్ థ్రిల్లర్గా రూపొందనున్న ఈ చిత్రంలో అర్జున్ సర్కార్ అనే ఓ పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్గా నాని కనిపించనున్నారు. వాల్‌పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
ఇక ఇంతకుముందు యువ హీరోలు విష్వక్ సేన్ ‘హిట్’, అడివి శేష్ ‘హిట్ 2’లో నటించారు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో ‘హిట్ 3’పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ క్రేజీ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం ‘హిట్ 3’ మూవీలో నానితో పాటు మరో ఇద్దరు హీరోలు కనిపించనున్నారని తెలుస్తోంది.
హిట్ మూవీ హీరో విశ్వక్ సేన్, హిట్-2 మూవీ హీరో అడివి శేష్ ఇప్పుడు హిట్-3లో కీలక పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. సినిమాను మలుపు తిప్పే విధంగా వారిద్దరి పాత్రలు ఉండనున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగా.. ఈ సినిమా వేసవి కానుకగా మే 1న విడుదల కానుంది.

