నిన్న జరిగిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా హైలైట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మెగా స్టార్ చిరంజీవి స్పీచ్ లో హైలైట్స్. అవేంటో చూద్దాం
- మెగాసార్ చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా ను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ లు సంయుక్తం గా నిర్మిస్తున్నాయి. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల లు ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ వేసవి సెలెవులలో ప్రారంభమైన వచ్చే సంక్రాంతి కి రావచ్చు
- ఇక్కడ ఉన్నది నందమూరి కాంపౌండ్, మెగా కాంపౌండ్ కాదు సినీ కాంపౌండ్ అన్న మెగాస్టార్ చిరంజీవి. ఇదే సమాధానాన్ని విశ్వక్ సేన్ ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పినందుకు మెగాస్టార్ చిరంజీవి విశ్వక్ సేన్ ను అభినందించారు
- ప్రజారాజ్యం, జనసేన గా రూపాంతరం చెందిందని. నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ని చూసి గర్విస్తున్నాని అన్నారు. అంతే జై జనసేన అని అభిమానులను ఉత్సాహపరిచారు. పుష్ప-2 ని చూసి గర్విస్తున్నానని కూడా చెప్పారు
- లండన్ లో మెగా స్టార్ చిరంజీవి కి సన్మానం జరగబోతోంది అని మెగా లీక్ చేశారు మన మెగాస్టార్ చిరంజీవి గారు. సుమ ని ఫ్లైట్ టికెట్స్ నువ్వే పెట్టుకోవాలి అన్నారు
- అంతే కాకుండా లేడీ గెట్ అప్ లో వచ్చిన ప్రతి సినిమా విజయ సాధించాయని అన్నారు. ఆనాటి చిత్రం భళారే విచిత్రం నుండి మొన్న రాజేంద్ర ప్రసాద్ మేడమ్ వరకు హిట్ అయ్యాయని తెలిపారు. లైలా కూడా సూపర్ హిట్ గ్యారంటీ అని అన్నారు
- మెగా స్టార్ చిరంజీవి గారు నటించిన సినిమాలలో, విశ్వక్ సేన్ కు నచ్చిన సినిమా ‘ఆపద్బాంధవుడు’
- లైలా చిత్ర దర్శకుడు రామ్ నారాయణ్ కు నచ్చిన మెగా స్టార్ చిరంజీవి సినిమా ‘కొదమ సింహం’
లైలా సినిమా ఈ నెల 14 విడుదలవుతోంది. నవ్వులు గ్యారంటీ అని చెపుతున్నారు మేకర్స్

