26 ఏళ్ళ తరవాత ఢిల్లీ పీఠం పై భాజపా

by | Feb 8, 2025 | వార్తలు

26 సంవత్సరాల తరవాత ఢిల్లీ ప్రజలు భాజపా కు పట్టం కట్టారు.  ఈ సారి ఢిల్లీ ఎన్నికల్లో ఓటర్ లు స్పష్టమైన తీర్పు చారు.

ఆప్ మాజీ ముఖ్యమంత్రి, అధ్యక్షుడు అయిన అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయారు. అంతే కాకుండా ఉప ముఖ్యమంత్రి సిసోడియా కూడా ఓడిపోయారు. ఆప్ మరో కీలక నేత సత్యేందర్  జైన్ కూడా ఓడిపోయారు.  ఈ ముగ్గురు నేతలు జైలుకు వెళ్లి వచ్చినవారే

ప్రస్తుత ముఖ్యమంత్రి అతిశీ విజయం సాధించటం ఆప్ కు కొంతలో కొంత ఊరట 

70 అసెంబ్లీ నియోజక వర్గాలున్న ఢిల్లీ లో, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన మేజిక్ ఫిగర్ 36.

భాజపా మొత్తంగా 48 సీట్లు గెలుచుకుంది. ఆప్ కేవలం 22 సీట్లకే పరిమితం అయ్యింది.  కాంగ్రెస్ వరసగా మూడవ సారి ఖాతా తెరవలేదు.

ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ప్రకటించాక పోయినా భాజపా గెలిచిందంటే, ఢిల్లీ ప్రజల్లో ఆప్ పట్ల ఎంత వ్యతిరేకత ఉందొ తెలుస్తోంది