జొన్నలగడ్డ సిద్దు ‘జాక్’ టీజర్ విడుదల

by | Feb 7, 2025 | సినిమా

డి జే టిల్లు ఫ్రాంచైజ్ తో పాపులారిటీ సంపాదించుకున్న నటుడు జొన్నల గడ్డ సిద్దు.  సిద్దు ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘జాక్’ అనే సినిమాలో  నటిస్తున్నాడు.  ఈ సినిమా టీజర్ ను సిద్దు బర్త్ డే కానుకగా  విడుదల చేశారు మేకర్స్.

ఈ చిత్రం లో సిద్దు ఒక దొంగగా కనిపించబోతున్నాడు. సిద్దు కి జంటగా, ప్రేమించే యువతీ పాత్రలో వైష్ణవి చైతన్య నటిస్తోంది

అచు రాజమణి సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను బి వి ఎస్ ఎన్ ప్రసాద్, బాపినీడు సంయుక్తం గా నిర్మిస్తున్నారు. సమ్మర్ కానుకగా, ఏప్రిల్ 10 న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.