శివ కార్తికేయన్ ‘అమరన్’ టెలివిజన్ లో కూడా సూపర్ హిట్

by | Feb 7, 2025 | టీవీ & ఓటిటి

శివ కార్తికేయన్ హీరో గా వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘అమరన్’.  మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారం గా రూపొందించిన ఈ సినిమాలో మేజర్ ముకుంద్ పాత్రలో శివ కార్తికేయన్ అద్భుతం గా నటించాడు. మేజర్ ముకుంద్ భార్య రెబెక్కా పాత్రలో సాయి పల్లవి అద్భుతమైన నటన కనపరిచారు

కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించారు. జి వి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు.  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది. సుమారు 335 కోట్ల రూపాయలు వసూలు చేసింది

ఈ అమరన్ సినిమాని స్టార్ మా లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బ్రాడ్ కాస్ట్ చేశారు.  అయితే టెలివిజన్ లో అమరన్ 11 రేటింగ్ పాయింట్ ల ను సాధించింది.

ఈ మధ్య కాలంలో టెలివిజన్ లో సినిమాలకు  అంత ఆదరణ రావడం లేదు. అయితే గత వారం  స్టార్ మా లో  వచ్చిన లక్కీ భాస్కర్ 10 రేటింగ్ పాయింట్ లను సాధిస్తే,  ఈ వారం అదే స్టార్ మా లో  అమరన్ 11 రేటింగ్ పాయింట్ లు సాధించింది