లైలా కోసం రంగంలోకి మెగా స్టార్ చిరంజీవి

by | Feb 7, 2025 | సినిమా

విశ్వక్ సేన్ జీరో గా వస్తోన్న సినిమా లైలా.  నిన్ననే మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.  ఈ ట్రైలర్ చూస్తుంటే, విశ్వక్ సేన్ లేడీ గెట్ లో నవ్వులు పూయిస్తాడని అర్ధమవుతోంది.

షైన్ స్క్రీన్ పతాకంపై, సాహు గారపాటి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రామ నారాయణ్ దర్శకుడు. లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తూన్నారు

ఆకాంక్ష శర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ నెల 14 న, ప్రేమికుల దినోత్సవం సందర్భంగా లైలా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవబోతోంది

అయితే చిత్ర నిర్మాత సాహు గారపాటి,  మాస్ క దాస్ విశ్వక్ సేన్ స్వయం గా చిరంజీవి గారింటికి వెళ్లి, ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. ఈ మేరకు ఎక్స్ లో ఫోటో లు పంచుకున్నారు