ఖగోళ శాస్త్రవేత్త డోర్జే ఆంగ్ చుక్ భూమి పరిభ్రమిస్తున్న వీడియో ను చిత్రీకరించారు. ఆయన ఇండియన్ ఆస్ట్రో నామికల్ అబ్జర్వేటరీ లో ఇంజినీర్ ఇంచార్జి గా పని చేస్తోన్న డోర్జే ఆంగ్ చుక్ 24 గంటలపాటు భూభ్రమణాన్ని టైం లాప్స్ ఉపయోగించి చిత్రీకరించారు. దీనిని సింపుల్ ఒక నిమిషం వీడియో గా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇంకా ఆంగ్ చుక్ ఏం చెప్పారంటే నక్షత్రాలు స్థిరంగా ఉంటాయి, కానీ భూమి ఎప్పుడూ తిరగడం ఆపదు. నా లక్ష్యం 24 గంటల పూర్తి టైమ్-లాప్స్‌ను సంగ్రహించడం, ఇది పగటి నుండి రాత్రికి మరియు తిరిగి వచ్చే పరివర్తనను వెల్లడిస్తుంది.
ఈ వీడియో లడాఖ్ లో చిత్రీకరించారు
విద్యార్థులందరికీ ఈ వీడియో చూపించండి. భూభ్రమణం గురించి సులభంగా అర్ధమవుతుంది.
ధన్యవాదాలు డోర్జే ఆంగ్ చుక్ జి

