సోషల్ మీడియా సంగతులు 2024 – మీకు తెలుసా

by | Jan 30, 2025 | ప్రగడ టీవీ

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో అకౌంట్ లేని వారు నగరాలలో ఎవరు ఉండరేమో అంటే అతిశయోక్తి కాదు.   సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ సంబందించిన ఇంటరెస్టింగ్ డేటా పాయింట్స్ చూద్దామా

  • ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా ను ఎంత మంది ఉపయోగిస్తున్నారా తెలిసా…. 520 కోట్లమంది 2024 లో సోషల్ మీడియా ను ఉపయోగించారు. అందులో 28 కోట్ల మంది కొత్తగా 2024 లో ఖాతాలు తెరిచినా వాళ్ళు
  • 2024 లో సోషల్ మీడియాలో భారతీయులు ప్రకటనల మీద ఖర్చు పెట్టిన మొత్తం సుమారు Rs.11000 కోట్లు
  • యూట్యూబ్ మీద అత్యధిక ఆదాయం సంపాదించినా ఛానల్ ‘మిస్టర్ బీస్ట్’. అమెరికాకు చెందిన ఈ ఛానల్ సబ్ స్క్రైబర్స్ 34 కోట్లు. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం 2024 లో ఈ యూట్యూబ్ ఛానల్ ఆదాయం అక్షరాలా 723  కోట్లు
  • ఇంస్టాగ్రామ్ లో 27 కోట్ల మంది ఫాలోవర్లతో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇండియా లో నెంబర్ 1.  ఎక్స్ లో (ట్విట్టర్) 10 కోట్ల ఫాలోవర్లతో మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నెంబర్ 1
  • మన దేశంలో అత్యధిక సబ్ స్క్రైబర్స్ ఉన్న నెంబర్ 1 యూట్యూబ్ ఛానల్ ఏదో తెలుసా.. టి -సిరీస్, 28 కోట్ల సబ్ స్క్రైబర్స్
  • 2024 లో లింక్డిన్ చూసే వారి సంఖ్య 100 కోట్లకు చేరుకుంది.
  • ప్రపంచంలో నెంబర్ వన్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘పేస్ బుక్’ (ఎక్కువ మంది భారతీయులే ఇందులో).  ఆ తరవాత రెండవ స్థానంలో ఇంస్టాగ్రామ్ ఉంది.
  • లింక్డిన్ లో వారానికి సుమారు ఆరున్నర కోట్ల మంది ఉద్యోగాల కోసం వెదుకుతున్నారు. అందులో, నిమిషానికి సుమారు 6 ఉద్యోగం సంపాదిస్తున్నారట.
  • గూగుల్ లో ఏ విషయాల గురించి ఎక్కువగా వెతికారో తెలుసా
    • ఎక్కువ మంది వెతికిన వ్యక్తి  – వినేష్ ఫోగాట్
    • ఎక్కువ మంది అర్ధం వెతికిన పదం – అల్ ఐస్ ఆన్ రఫా
    • ఎక్కువ మంది వెతికిన అంశం – ఐపీల్
    • ఎక్కువ మంది వెతికిన ఓ టి టి షో – హీరామండి
    • ఎక్కువ మంది వెతికిన పర్యాటక ప్రాంతం – అజర్ బైజన్
    • ఎక్కువ మంది వెతికిన సినిమా – స్త్రీ 2
    • ఎక్కువ మంది వెతికిన వంట – పోర్న్ స్టార్ మార్టిని

ఇవే కాకుండా ఎక్కువ మంది గూగుల్ లో వెతికిన టాప్ టెన్ సినిమాలలో తెలుగు సినిమాలు కల్కి, హనుమాన్, సాలార్ సినిమాలు ఉన్నాయి.  వంటల కు సంబంధించి ఆవకాయ రెండవ స్థానం లో ఉంది. ఎక్కువ మంది వెతికిన వ్యక్తులలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐదవ ప్లేస్ లో ఉన్నారు.  అంతే కాకుండా 2024 లో రతన్ టాటా గురించి ఎక్కువ మంది గూగుల్ లో వెతికారట ఇవన్నీ చదివాక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పవర్ తెలిసిందా.  అయితే సోషల్ మీడియా  ప్లాట్ ఫామ్స్ ని అవసరం మేరకు వాడుకోవాలి