మౌని అమావాస్య అంటే ఏమిటి, దాని విశిష్టత

by | Jan 29, 2025 | ప్రగడ టీవీ

పుష్య మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఇది మహాశివరాత్రికి ముందు వచ్చే ఆఖరి అమావాస్య. అంతే కాకుండా మహా కుంభమేళా జరుగుతున్నా సమయంలో వచ్చింది.  అందుకే ఈ సారి మౌని అమావాస్యకు అంత ప్రత్యేకత.  ఆంధ్రాలో దీనిని చోళంగి అమావాస్య అని కూడా అంటారు

మౌని అంటే మౌనం అని అర్ధం. మౌనం పాటించడం అని అర్ధం. పరుషపదాలు మాట్లాడకూడదు

మకర రాశి లో సూర్యుడు, చంద్రుడు ఉన్న స్థితి (సూర్య చంద్రుల సమాగమం), బృహస్పతి వృషభ రాశి ఉన్న స్థితి లో, క్షీర సాగర మధనం జరిగినప్పుడు అమృత బిందువులు హరిద్వార్(Uttarakhand), ప్రయాగ రాజ్(Uttarapradesh), ఉజ్జయియిని(Madhyapradesh), నాసిక్ (Maharastra) లో పడినట్లు శాస్త్రం చెపుతోంది.   

మహా కుంభమేళా జరుగుతున్న సమయంలో ఈ అమావాస్య వచ్చింది కాబట్టి, దీనికి అంత ప్రత్యేకత.   బ్రహ్మ దేవుడు మొదటి యజ్ఞం చేసిన స్థలం ప్రయాగ రాజ్.  అంతే కాకుండా గంగ, యమునా, సరస్వతి ల త్రివేణి సంగమం ప్రయాగ్ లో జరుగుతుంది కాబట్టి ఇక్కడి స్నానం ఎంతో పుణ్య ఫలాన్ని ఇస్తుంది.

త్రివేణి సంగమ స్నానం కోటి యజ్ఞాలతో సమానం. మౌని అమావాస్య నాడు నది స్నానం చేస్తే శరీర శుద్ధి, మనసు శుద్ధి, అంతఃకరణ శుద్ధి అవుతుంది.  నది స్నానం చేయలేని వారు మీ ఇంట్లో వంటి మీద బట్టలతో గోవిందా గోవిందా అనుకుని స్నానం చేసి ఆ తర్వాత పొడి బట్టలతో దేవతార్చన చేస్తే నది స్నానం పుణ్యం దక్కుతుంది

మౌని అమావాస్య రోజు శివ కేశవులను పూజించాలి. సూర్యుడిని ఆరాధించాలి. నది స్నానాలు చేయాలి

పితృ దేవతలకు సంబంధించిన కార్యక్రమాలకు మౌని అమావాస్య చాలా విశేష ఫల ప్రదమైన రోజు. పితృ దేవతలకు తర్పణాలు వదలాలి, శివ కేశవుల ఆరాధనతో అభీష్టసిద్ధి, శివ నామ స్మరణ, అన్నదానం, వస్త్ర దానం, జపం, దైవ స్మరణ వలన పుణ్యం విశేషం గా లభిస్తుంది.  రవి చెట్టును పూజిస్తే విష్ణు ప్రీతీ కలుగుతుంది