ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా లో తొక్కిసలాట జరిగింది. ఈ రోజు మౌని అమావాస్య కావడంతో రద్దీ మరింత పెరిగింది. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 20 మృతి చెందారు. మరో 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం గాయపడిన వారిని హుటా హుటిన అంబులెన్స్ లలో ఆస్పత్రికి తరలిస్తున్నారు
మౌని అమావాస్య సందర్భం గా భారీ సంఖ్యలో భక్తులు పుణ్య స్థానాలకు వచ్చారు. భక్తుల తాకిడికి బారికేడ్లు సైతం విరిగిపోవడంతో తొక్కిసలాట జరిగింది.
ఈ రోజు, ఇప్పటివరకు, సుమారు 2.8 కోట్ల మంది అమృత స్థానాలు చేసారని అంచనా. రోజు మొత్తమ్మీద 10 కోట్ల మంది అమృత స్థానాలు చేస్తారని అంచనా
రెండవ రోజు అమృత స్దాన కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సీఎం యోగి ఆదిత్యానాధ్ ఆదేశాలతో తిరిగి అమృత స్థానం ఉంటాయని అఖాడాలు ప్రకటించారు.
సీఎం యోగి ఆదిత్యనాధ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉన్నది
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా ఫోన్ లో సీఎం యోగి తో మాట్లాడారు.
ప్రయాగ రాజ్ మార్గం లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యిందని సమాచారం

