16 ఏళ్ళ లోపు పిల్లలను థియేటర్ లోకి అనుమతి ఇవ్వకూడదా. తెలుగు సినిమా నియంత్రణ హై కోర్ట్ చేతిలోకి వెళ్లిందా. పుష్పరాజ్ చేసిన పనికి, తెలుగు సినిమా ప్రదర్శనకు సంబంధించి హై కోర్ట్ కలగచేసుకోవలసిందేనా
పుష్ప-2 నుండి తెలుగు సినిమా వివాదాలనుండి బయటకు రాలేకపోతోంది. పుష్ప-2 సినిమా దెబ్బకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా టికెట్ రేట్స్ పెంపుదలకు, బెనిఫిట్ షోల కు ఇకపై అనుమతి ఇచ్చేది లేదని చెప్పారు. అయితే గేమ్ చేంజర్ సినిమాకు, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న దిల్ రాజు స్పెషల్ పర్మిషన్ తెచ్చుకున్నాడు. అయితే, 4 పిటిషన్లు దాఖలు అయినాయి. విచారణ తరవాత ధర్మాసనం, అదనపు షో లను రద్దు చేయాలనీ, టికెట్ రేట్లు పెంపుదల నిలిపి వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం దిగి వచ్చి గేమ్ చేంజర్ అదనపు షోలను రద్దు చేసింది. టికెట్ రేట్లను కూడా సాధారణ రేట్లకు తీసుకు వచ్చింది. అయితే, ఈ వివాదం అంతటి తో ఆగలేదు.
ఇప్పుడు హై కోర్ట్ 16 ఏళ్ళ లోపు పిల్లలను ఉదయం 11 లోపు, రాత్రి 11 తరవాత సినిమాలకు అనుమతించరాదని థియేటర్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా, దీని మీద మేధావులైన అన్ని వర్గాల వారితో చర్చలు జరిపి ఒక నిర్ణయానికి రమ్మని హై కోర్ట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది..
అయితే న్యాయవాది చెప్పిన ప్రకారం, సినిమాటోగ్రఫీ నిబంధనల ప్రకారం ఉదయ 8.40 లోపు, తెల్లవారుజామున 1.30 తర్వాత సినిమాలను ప్రదర్శించడానికి అనుమతి లేదన్నారు. ముఖ్యయం మైనర్లను సినిమాలకు అసలు అనుమతించరాదని న్యాయవాది చెప్పారు. అనుమతించిన పక్షంలో, అది పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని చెప్పారు. అప్పటివరకు పిల్లలను ఉదయం 11లోపు, రాత్రి 11 తర్వాత సినిమా థియేటర్ లలోకి అనుమతించరాదని థియేటర్ యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.
తదుపరి విచారణ ఫిబ్రవరి 22 కు వాయిదా వేశారు. ఈ లోగా ప్రభుత్వం సంబంధిత అన్ని వర్గాలతో చర్చలు జరిపి, ఒక నిర్ణయానికి వచ్చి, హై కోర్ట్ కు తెలియాలి.

